సుకుమార్ డైరెక్షన్లో మెగా పవర్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పనక్కర్లేదు. ఇక చెర్రీకి జోడీగా నటించిన సమంత.. సినిమాకు ముందే రంగమ్మా.. మంగమ్మా అంటూ ప్రేక్షకుల మనసు దోచేసింది. ఈ సినిమాలోని పాటలన్నీ మంచి సక్సెస్ సాధించాయి. కానీ వీటిలో రంగమ్మా.. మంగమ్మా సాంగ్ మాత్రం ఓ మెట్టు పైనే ఉంది.
తాజాగా ఈ సాంగ్‌ను పేరడి చేస్తూ దుమ్ము రేపింది ఓ చిన్నారి. ఈమె ఎవరో కాదు నటుడు ఉత్తేజ్ చిన్న కూతురు పాట. ఓరయ్యో ఓలమ్మో అంటూ పాడి ఆడి అలరించింది. రామ్ చరణ్‌ని ప్రశంసలతో ముంచెత్తుతూ రంగస్థలం సెట్స్‌లో పాట తన డ్యాన్స్‌తో ఇరగదీసింది. ఈ పేరడీ సాంగ్ అసలు పాటను మించి ఉండటం విశేషం. ఇప్పుడీ సాంగ్ నెట్టింట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఉత్తేజ్ పెద్ద కుమార్తె చేతన ఈ పాటను డైరెక్ట్ చేయడమే కాకుండా శ్రీనాథ్‌తో కలిసి కొరియోగ్రఫీ కూడా చేసింది.