• వర్మతో నాగ్ ‘ఆఫీసర్’ మూవీ 
  • అఖిల్ మూవీపై వర్మ స్పందన 
  • అయోమయంలో అభిమానులు

రామ్ గోపాల్ వర్మ ఒక వైపున నాగార్జున హీరోగా ‘ఆఫీసర్’ సినిమా చేస్తూనే, మరో వైపున అఖిల్ తో కూడా తాను సినిమా చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం ప్రకటించాడు. అసలే అఖిల్ కి ఇంతవరకూ సరైన హిట్ పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ సాహసం చేస్తున్నట్టేనని అంతా అనుకున్నారు. ఇదే సమయంలో చోటుచేసుకున్న కొన్ని వివాదాస్పదమైన కారణాల వలన, ఈ ప్రాజెక్టు ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు.ఇక  ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న అఖిల్, ఆ తరువాత సినిమాను కొరటాల శివతో చేయవచ్చనే టాక్ నిన్నంతా బలంగా వినిపించింది. దాంతో ఇక వర్మతో అఖిల్ సినిమా లేనట్టేనని చెప్పుకున్నారు. అయితే అఖిల్ తో తన సినిమా ఉందని మరోసారి వర్మ స్పష్టం చేశాడు. ఈ సినిమా గురించి వచ్చే నెలలో మాట్లాడతానని చెప్పాడు. దాంతో అఖిల్ అభిమానులు మరోసారి అయోమయంలో పడిపోయారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments