తెలుగు కథానాయికలలో .. తెలుగుదనం ఉట్టిపడే కథానాయికలలో అంజలి ఒకరుగా కనిపిస్తుంది. అంజలి సహజమైన నటనను .. ఆమె డైలాగ్ డెలివరీని ఇష్టపడే అభిమానులు ఎంతోమంది వున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. తాజాగా ఇదే విషయాన్ని గురించి అంజలి దగ్గర ప్రస్తావిస్తే ఆమె తనదైన శైలిలో స్పందించింది.తెలుగు దర్శక నిర్మాతలు నన్ను పట్టించుకోవడం లేదు. అందువలన తెలుగు నుంచి నాకు అవకాశాలు రావడం లేదు. తమిళంలో అవకాశాలు బాగానే వున్నాయి .. అందువల్లనే అక్కడే వుండిపోతున్నాను. నేను సన్నబడటం వలన తమిళంలో అవకాశాలు పెరిగాయి. తెలుగు నుంచి మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. మంచి పాత్రలతో వస్తే చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే వున్నాను” అని చెప్పుకొచ్చింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments