ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

0
264

నగరంలోని సనత్‌నగర్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఆర్‌ఎస్ బ్రదర్స్ గోదాంలో ఈ ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం సమాచారం అందుకుని సంఘటనాస్థలికి చేరుకున్న మూడు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి.షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్నిప్రమాదం వల్ల గోదాంలో ఉన్న సరుకు మొత్తం కాలి బూడిద అయింది. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here