బాలికను సొంత డబ్బులతో చదివిస్తాం…

0
251

చేపల్లిలో అత్యాచారానికి గురైన బాలికను సొంత డబ్బులతో చదివిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆయన శనివారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బాధిత కుటుంబానికి ఇప్పటికే రూ. 5 లక్షలు ఇచ్చామని, మరో రూ. 5 లక్షలు చిన్నారి పేరు మీద డిపాజిట్‌ చేస్తామన్నారు. టెక్నాలజీని కొందరు చెడుకు ఉపయోగించకుంటున్నారని, అనుకోని ఘటనలు జరిగినప్పుడు బాధ్యతతో మాట్లాడాలని, ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని సీఎం అన్నారు. ఇది తీవ్రమైన నేరం…, నాగరిక ప్రపంచం సిగ్గుపడే ఘటన అని, ఫిర్యాదు వచ్చిన వెంటనే 15 టీంలను రంగంలోకి దింపామన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు అన్నారు. అలాగే అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయనే భయం రావాలన్నారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు శిక్షలు పడేలా చూస్తామని, కామాంధులపై ప్రజలు తిరగబడాలని, ఇలాంటి ఘటనల పట్ల ప్రజల్లో చైతన్యం రావాలని, ఇలాంటి ఘటనలను రాజకీయం చేయడం సరికాదని చంద్రబాబు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here