భారతీయ సినీ చరిత్రలో రికార్డుల సునామీ సృష్టించిన ‘బాహుబలి-2’ సినిమాను ఇటీవల చైనాలోనూ విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజే 2.85 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.19కోట్లు) వసూలు చేసి ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ సినిమా ( 2.49మిలియన్‌ డాలర్ల ఓపెనింగ్‌) రికార్డులను బద్దలు కొట్టిందని సినీ విశ్లేషకులు చెప్పారు.

ఆ దేశంలో భారీ ఓపెనింగ్స్‌ వచ్చిన భారతీయ సినిమాల్లో ‘బాహుబలి 2’ మూడవ స్థానంలో ఉందని అన్నారు. ఇక మొదటి స్థానంలో ఆమిర్‌ ఖాన్‌ నటించిన మరో సినిమా ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ (6.74 మిలియన్‌ డాలర్లు) నిలవగా, రెండో స్థానంలో ‘హిందీ మీడియం’ సినిమా (3.39మిలియన్‌ డాలర్లు) ఉంది. ‘బాహుబలి2’ చైనాలో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ‘బాహుబలి-2’ సినిమా దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన విషయం తెలిసిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments