అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో బన్నీ సైనికుడిగా కనిపించాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అయిన ఈ సినిమా బన్నీ కెరీర్‌లోనే బిగెస్ట్‌ ఓపెనింగ్స్‌ సాధించింది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తొలి రోజు 40 కోట్ల రూపాయల గ్రాస్‌ సాధించినట్టుగా తెలుస్తోంది.

బన్నీ కెరీర్‌లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా నా పేరు సూర్య  రికార్డ్ సృష్టించింది. బన్నీ సరసన అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శరత్‌ కుమార్‌, అర్జున్‌, బొమన్‌ ఇరానీ, రావూ రమేష్‌, నదియాలు ఇతర కీలకపాత్రలో నటించారు. చాలా కాలం తరువాత మెగా బ్రదర్‌ నాగబాబు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించగా లగడపాటి శిరీషా, బన్నీ వాసులు సంయుక్తంగా నిర్మించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments