సినీ పరిశ్రమలో ప్రేమలు, లివింగ్ రిలేషన్ షిప్ లాంటివి ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరోయిన్లు ప్రేమలో పడటం కామన్ అని చెప్పారు. తన జీవితంలో అన్నీ అనుకోకుండానే జరిగిపోయాయని చెప్పారు. అనుకోకుండానే హీరోయిన్ అయ్యాయని, అనుకోకుండానే పొలిటీషియన్ అయ్యానని చెప్పారు. చదువుకునే రోజుల్లో తాను చిరంజీవి, నాగార్జునలకు ఫ్యాన్ అని తెలిపారు. చిరంజీవితో మూడు సినిమాలు చేశానని, ఆయన తనకు బాస్ అని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు చేయడం సహజమేనని… రాజకీయాలకు పనికిరాడు అని తాను అన్నప్పుడు చిరంజీవి కూడా బాధపడే ఉంటారని అన్నారు.

వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిలను ఉద్దేశించి సోషల్ మీడియాలో చాలా దారుణంగా రాశారని… ఆవిడ ఎత్తు ఎదిగిన పిల్లలు ఆమెకు ఉన్నారని… ఆమె కుటుంబం బాధపడేలా టీడీపీవారు దారుణమైన ప్రచారం చేశారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారని… బాలకృష్ణ, హరికృష్ణలకు కూడా అవసరం తీరిపోయాక పంగనామాలు పెట్టారని రోజా విమర్శించారు. మళ్లీ అవసరం వచ్చాక బాలకృష్ణ కూతురును కోడలు చేసుకున్నారని, జూనియర్ ఎన్టీఆర్ కు తన బంధువులన అమ్మాయిని ఇచ్చి పెళ్లి జరిపించారని చెప్పారు. పవన్ కల్యాణ్ టాప్ హీరోల్లో ఒకరని… అయితే రాజకీయాల్లో ఆయన అధికారంలోకి వస్తారని తాను భావించడం లేదని… కానీ, రాజకీయాలను మాత్రం ప్రభావితం చేయగలరని తెలిపారు. బాలకృష్ణ ఈరోజుకు కూడా నెంబర్ వన్ హీరోనే అని… కానీ, ఆయనలాంటి వాళ్లను వదిలేసి కేవలం పవన్ కల్యాణ్ నే రాజకీయంగా టార్గెట్ చేస్తుండటం సరికాదని అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments