పెళ్లి వేడుకలో ప్రియా వారియర్‌ సందడి!

0
308
  • ‘ఒరు అదార్ లవ్’లో సహనటుడు అరుణ్ పెళ్లికి వెళ్లిన ప్రియ
  • ‘హవా హవా’ అనే పాటకు ఆడిపాడిన ప్రియా వారియర్
  • సామాజిక మాధ్యమాలకు చేరిన వీడియో

‘ఒరు అదార్ లవ్’ మలయాళ చిత్రం విడుదలకు ముందే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నటి ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ చిత్ర టీజన్ లో ప్రియా వారియర్ కన్నుకొట్టే సన్నివేశం ఎంతగానో ఆకట్టుకుంది..ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రియా వారియర్ బయట ఫంక్షన్స్ కు వెళితే చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు, మాట్లాడేందుకు ఆసక్తి కనబరిచే వారు కోకొల్లలు. ‘ఒరు అదార్ లవ్’ లో నటించిన తన సహ నటుడు అరుణ్ వివాహానికి ప్రియావారియర్ హాజరైంది. ఈ వేడుకకు అరుణ్ కుటుంసభ్యులు, అతని స్నేహితులు, సన్నిహితులతో పాటు మాలీవుడ్ ప్రముఖులు కొందరు మాత్రమే పాల్గొన్నారు. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రియా వారియర్ పింక్ రంగు చీరలో మెరిసిపోయింది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ సినిమా ‘ఇన్సాఫ్ అప్నే లాహూ సే’ లోని ‘హవా హవా’ అనే పాటకు తన మిత్రులతో కలిసి ప్రియా వారియర్ ఆడిపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here