సోగ్గాడే చిన్ని నాయనా మరియు రారందోయ్ వేడుక చూద్దాం సినిమాల ద్వారా తనేంటో నిరూపించుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. మాస్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ మాస్ మహారాజ్ రవితేజ. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం “నేలటిక్కెట్”. హీరోయిన్ గా మాళవిక శర్మ నటిస్తుండగా, ఎస్.ఆర్.టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శక్తి కాంత్ కార్తీక్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం లో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 24 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు కానుంది

ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 10 వ తారీఖున జరగనుంది. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని దర్శకులు కళ్యాణ్ కృష్ణ కురసాల తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments