మీడియా ఛానళ్ళపై “మెగా” కంట్రోల్ మొదలయినట్టు కనపడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసినట్టు భావిస్తున్న ఆ నాలుగు ఛానళ్ళ పై నిషేధం విధించే క్రమంలో మెగా ఫ్యామిలీ తొలి అడుగు వేసినట్టునట్టు కనిపిస్తోంది. నటి శ్రీరెడ్డి వ్యవాహారం కాస్తా మలుపులు తిరుగుతూ పవన్ వర్సెస్ మీడియా ఛానల్స్ లా తయారయ్యింది. తనపై కుట్ర జరుగుతోందని పవన్ డైరెక్ట్ గానే మీడియా సంస్థలను టార్గెట్ చేయడంతో వ్యవహారం మెగా కాంపౌండ్ కు చేరింది. పవన్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న ఆ నాలుగు ఛానళ్ళను బహిష్కరించాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. దానితో మెగా ఫ్యామిలీ ఒక తాటి పైకి వచ్చింది. మీడియా విషయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై మెగాస్టార్ చిరంజీవి అద్యక్ష్యతన సినీ హీరోలు సమావేసంయ్యారు. అందులో భాగంగా కొన్ని సంస్థలపై ఇండస్ట్రీ నిషేధం విధించాలని అందులో నిర్ణయించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇది నిజం కాదని పలువురు చెప్పినా చివరకు పవన్ మాటనే వీరతా ఫాలో అవుతునట్టు తెలుస్తోంది. సినీరంగంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి.

అల్లు అర్జున్ నటించిన “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ”  టీం ఇంటర్వ్యూ కొన్ని ఛానళ్ళకు ఇవ్వకపోవడం చర్చలకు దారి తీసింది. హీరో అల్లు అర్జున్,హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్,దర్శకుడు వక్కంతం వంశీ కాంబినేషన్ లో ఒక ఇంటర్వ్యూ షూట్ చేసారు. పవన్ బహిష్కరించమన్న నాలుగు ఛానళ్ళకు తప్ప మిగతా అన్నిటికీ పంపించారు. అన్నింటికీ పంపి ఈ నాలుగు ఛానళ్లు కు పంపకపోవడం పై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మీడియా నియంత్రణపై ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెసిడెంట్ జెమిని కిరణ్ స్పందిస్తూ తమ కంటెంట్ ఎవరికి ఇవ్వాలనేది నిర్మాతల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సినిమా ప్రకటనలు అన్నిటికీ కాకుండా కొన్నిటికే ఇచ్చినప్పుడు ఎందుకు ఈ ప్రశ్న అడగలేదని కేవలం మెగా ఫ్యామిలీ కోసమే ఇదంతా చేయడం లేదని,మెగా ఫ్యామిలీ మాత్రమే ఇండస్ట్రీ కాదని మెగా ఫ్యామిలీ కేవలం సినీ పరిశ్రమలో ఒక భాగమన్నారు.నా పేరు సూర్య,మహానటి లైవ్ ఈవెంట్స్ అన్ని ఛానల్స్ కు ఇచ్చారన్నారు. తాము హీరోల సమావేశం లో ఏం చర్చించుకున్నామో సరైన సమయంలో చేభుతామన్నారు. ఈ నిషేధం కేవలం నా పేరు సూర్య కే పరిమితం అవుతుందా మిగతా సినిమాలకు కూడా అమలవుతుందా అనేది వేచి చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments