కాన్సెప్ట్ అదుర్స్….

421

‘‘ఈవీవీగారి ‘జంబలకిడి పంబ’ నా ఫేవరెట్‌ సినిమాల్లో ఒకటి. అదే టైటిల్‌తో సినిమా అనగానే, అలాంటి కాన్సెప్ట్‌ మళ్లీ రావడం కష్టం కదా? ఎలా అనుకున్నాను. కానీ, వీళ్లకి అదిరిపోయే కాన్సెప్ట్‌ కుదిరింది. టైటిల్‌ కూడా కరెక్టుగా సరిపోయింది. మనం ఇప్పటివరకూ చూడని కాన్సెప్ట్‌ ఇది. చాలా సరదాగా చేసినట్టు అనిపిస్తోంది. టీజర్‌ చూస్తుంటే కచ్చితంగా హిట్‌ సాధిస్తారనిపిస్తోంది’’ అని హీరో నాని అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా జె.బి.మురళీ కృష్ణ దర్శకత్వంలో రవి, జోజో జోస్, శ్రీనివాస్‌ రెడ్డి. ఎన్‌ నిర్మిస్తున్న ‘జంబలకిడి పంబ’ సినిమా టీజర్‌ను నాని విడుదల చేశారు.

జె.బి.మురళీ కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇదొక కల్ట్‌ మూవీ. ఈవీవీగారు ‘జంబలకిడి పంబ’ సినిమాతో కామెడీలో కొత్త కోణాన్ని చూపారు. అప్పటి ఆ సినిమాకు మా సినిమాకు సంబంధం లేదు. కథకు సూట్‌ అవుతుందని ఈ టైటిల్‌ పెట్టాం’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్‌ని నానీగారు రిలీజ్‌ చేయడం హ్యాపీగా ఉంది. సినిమా తప్పకుండా అందర్నీ మెప్పించేలా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్‌ రెడ్డి. ‘‘సినిమా బాగా వస్తోంది. తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అన్నారు నిర్మాత రవి. నిర్మాతలు జోజో జోస్, సహ నిర్మాత బి.సురేశ్‌ రెడ్డి, లైన్‌ ప్రొడ్యూసర్‌ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here