సుకుమార్ దర్సకత్వంలో రామచరణ్,సమంత కలిసి నటించిన సినిమా రంగస్థలం. ఈ చిత్రం గత నెల విడుదలై మంచి హిట్ గా నిలిచిన మాట తెలిసినదే. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ స్పందించారు. చిట్టి బాబు రామచరణ్ నటనకే కాకుండా సినిమాలో నటించిన అందరి నటనకి మంచి పేరొచ్చింది. ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు ఈ సినిమాపై స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో రంగస్థలం గురుంచి మాట్లాడుతూ ఏ ఆర్టిస్ట్ అయినా సాధన చేస్తేనే పైకొస్తాడు,అందుకు ఉదాహరణ రంగస్థలం అన్నారు.రంగస్థలం విజయం సాదించిందంటే దాని వెనక ఎంతో కృషి ఉందని,సినిమా లో విషయం ఉంది కాబట్టి పెద్ద హిట్ అయ్యిందని అన్నారు. అలాగే ఏ సినిమా అయినా మంచి ఎఫర్ట్ పెట్టి చేస్తే విజయవంతం అవుతాయన్నారు…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments