• కల్యాణ్ రామ్ హీరోగా ‘నా నువ్వే’
  • కథానాయికగా తమన్నా 
  • ఈ నెల 6వ తేదీన ఆడియో రిలీజ్

కల్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో ‘నా నువ్వే’ సినిమా రూపొందుతోంది. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, వెన్నెల కిషోర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటివరకూ మాస్ ఆడియన్స్ ను అలరించే యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చిన కల్యాణ్ రామ్, ఈ సినిమాలో లవర్ బాయ్ గా నటిస్తుండటం విశేషం.పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. షేరేత్ సంగీతం ఈ సినిమాకి కొత్తదనాన్ని తెస్తుందని అంటున్నారు. ఈ నెల 6వ తేదీన ఆడియో వేడుకను భారీస్థాయిలో జరపనున్నారు. ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నాడని చెబుతున్నారు. తెలుగులో తమన్నాకి పూర్తిగా అవకాశాలు తగ్గిపోయిన సమయంలో వస్తోన్న సినిమా ఇది. ఈ సినిమా ఆమెకి మరొకొన్ని ఛాన్సులు తెచ్చిపెడుతుందేమో చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments