పోర్టు, పరిశ్రమల పేరుతో బందరులో 33 వేల ఎకరాల భూములను కాజేయాలని చూస్తున్న టీడీపీ నాయకుల ఆటలు కట్టిస్తానని ప్రతిపక్ష నాయకుడు జగన్‌ అన్నారు. తాము అధికారంలోకి రాగానే ఆ నోటిఫికేషన్‌ రద్దు చేస్తానని చెప్పారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో గురువారం జగన్‌ పాదయాత్ర నిర్వహించారు. పోర్టు భూములు, నోటిఫికేషన్లు, అమ్మకాలకు, కొనుగోళ్లుకు ఆటంకాలు, రిజిస్ర్టేషన్లు నిలిచిపోవడం తదితర అంశాలను ఆయాప్రాంతాల రైతులు జగన్‌కు చెప్పారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ… నాలుగేళ్లుగా రైతుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతానన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటానన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 4,800 ఎకరాల్లో మాత్రమే పోర్టు నిర్మాణం చేపడతామని, మిగిలిన భూముల జోలికి వెళ్లబోమని జగన్‌ చెప్పారు. పోర్టు నిర్మాణం పూర్తయ్యాక పరిశ్రమల కోసం పారిశ్రామికవేత్తలకు కావాల్సిన భూములను రైతుల అభీష్టం మేరకే తీసుకుంటామన్నారు. రైతులకు, పారిశ్రామికవేత్తలకు మధ్య ప్రభుత్వం సమన్వయకర్తగా వ్యవహరిస్తుందన్నారు. బలవంతపు భూసేకరణకు ఆస్కారమే ఉండదని, రైతులు నిశ్చింతగా ఉండొచ్చన్నారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments