కర్ణాటక ఎన్నికలు ఈ నెల 12 న జరగనున్న విషయం తెలిసిందే. బీజెపీ,కాంగ్రెస్,మాజీ ప్రధాని దీవే గౌడ నేతృత్వంలోని జేడీఎస్ పోటా పోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ కూడా కాంగ్రెస్ విధానాలను విమర్శిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ద్వారా బీజేపీ దక్షిణ భారతంలో అధికారంలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. ఈ నెల 15 న లెక్కింపు జరగనుంది.
బీజేపీ ముక్యమంత్రి అభ్యర్ధి యడ్యూరప్ప తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసారు . మేనిఫెస్టో ఈ విధంగా ఉంది..
రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ
మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు
దళిత విద్యార్ధులకు విద్యా రుణాలు
పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు
విద్యార్ధులకు ఉచిత ల్యాప్ టాప్