మెగా ఫ్యామిలీ,ఈ పేరుకి తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖమైన స్థానం ఉంది. మెగా ఫ్యామిలీ ద్వారా చాల మంది హీరోలు వచ్చారు .పవన్ కళ్యాణ్ మొదలుకొని వరుణ్ తేజ్ దాకా అందరు సినీ రంగ ప్రవేశం చేసి విజయం సాదించారు. పవన్ కళ్యాణ్,రామ్ చరణ్,అల్లు అర్జున్ స్టార్ స్టేటస్ సంపాదించుకోగా వరుణ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మరొకరు హీరో గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు,అతనెవరో కాదు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. ఇప్పటికే నటనకు కావలసిన శిక్షణ పూర్తి చేసుకున్న వైష్ణవ తేజ్ సాయి కోర్రిపాటి నిర్మాణంలో సినిమా లో నటించనున్నారు,ఆ చిత్రానికి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ తో కూడా అవసరాల శ్రీనివాస్ ఒక సినిమా చేయనున్నట్లు సమాచారం.
Subscribe
Login
0 Comments