• పౌర సమాజం తీవ్ర వేదనకి గురవుతోంది
  • సర్కారు ఆ బిడ్డకి, ఆమె కుటుంబానికి అండగా నిలబడాలి
  • ఇలాంటి అరాచకం చేసే వ్యక్తులు భయపడే పరిస్థితి రావాలి
  • అందుకు పబ్లిక్‌గా శిక్షించే విధానాలు రావాలి

గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కథువా నుంచి కన్యాకుమారి వరకు జరుగుతోన్న అత్యాచార ఘటనలపై విన్నప్పుడల్లా తనతో పాటు పౌర సమాజం తీవ్ర వేదనకి గురవుతోందని ట్వీట్‌ చేశారు. ఈ రోజు దాచేపల్లి ఘటన కూడా తన మనసుని కలచివేసిందని, నిస్సహాయతకు గురి చేసిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయానికి గురైన ఆ బిడ్డకి, ఆమె కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నానని అన్నారు. అసలు ఆడబిడ్డపైన ఇలాంటి అరాచకాలు చేసే వ్యక్తులు భయపడే పరిస్థితి రావాలంటే పబ్లిక్‌గా శిక్షించే విధానాలు రావాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments