రానున్న ఎన్నికలలో జనసేన మొత్తం 175 స్థానాలలో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే జనసేన పోటీ చేయడం వల్ల రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి,ఎవరికి నష్టం కలుగుతుంది అనే విషయాలను ప్రముఖ జర్నలిస్ట్ సాయి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరించారు.
గతంలో జరిగిన ఎన్నికలలో జరిగిన పరిణామాల దృష్ట్యా కచ్చితంగా భయాందోళనకు గురి చేసే అంశమని,ఒక కొత్త పార్టీ తెరమీదకు వచ్చినప్పుడు అధికార,ప్రతిపక్షాలకు ఒక భరోసా,భయము ఉంటాయన్నారు. 2009 లో తెలుగుదేశం విజయం తద్యం అనుకున్న సమయంలో ప్రజారాజ్యం ఆ ఆశలకు గండి కొట్టిందని,200 సీట్లతో ఉన్న కాంగ్రెస్ 155 స్థానాలకే పడిపోయిందన్నారు. రాష్ట్ర విభజన తరువాత సీట్లు 175 కు తగ్గడంతో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది చూడాలన్నారు.
కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ ను సొంతం చెసుకొకపోయినా ఆ వర్గం ఓట్లు చీలే అవకాశం పై తెలుగుదేశం భయందోళనాలో ఉందన్నారు. ముందు ఎన్నికలలో పశ్చిమ గోదావరిలో అన్ని సీట్లు,తూర్పు గోదావరిలో 90 శాతం వరకు గెలుచుకున్నందున ఇప్పుడు రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయన్నది తెలుగుదేశం ఆలోచిస్తోంది అన్నారు. రాయలసీమలో అనంతపురం,చిత్తూర్ జిల్లాల్లో తెలుగుదేశం బలం ప్రదర్శించగలిగిందని,ముఖ్యంగా అనంతపూర్ లో ఎక్కువ బలం నిరూపించుకోగలిగిందని కాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనంతపురం నుంచే పోటీ చేస్తానననడం తో కొంత వరకు శ్రేణులు ఆందోళనలో ఉనారన్నారు. జనసేన రాయలసీమలో ఉన్న తమ ఓట్లను అలాగే కోస్తా జిల్లాల్లో ఉన్న ఓట్లను ఎంతమేరకు చీలుస్తందాని వై ఎస్ ఆర్ సీ పీ ఆందోళనలో ఉందన్నారు .
గత ఎన్నికలలో తెలుగుదేశం,జనసేన, బీ జె పీ కలిసి పోటీచేసి ఇప్పుడు ఎవరికి వారు విడిపోవడం వలన తమకు విజయం తధ్యం అని వై సీ పీ కి భరోసా ఉంటుందన్నారు. అలాగే బీ జె పీ ,జనసేన వై సీ పీ ఓట్లు చీల్చడం వల్ల తమకు విజయం వరిస్తుందని టీడీపీ భావిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా ఏ మేరకు ప్రభావితం చేయగలరు అనేది ఎన్నిక తరువాతే తెలుస్తుందని,అయితే బలమైన శక్తీ రంగంలోకి దిగినప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశమైందన్నారు.