కర్ణాటకలో బీజేపీకి బుద్ధి చెప్పడానికి అక్కడి ఓటర్లు సిద్ధం: బోండా ఉమ

0
492
  • వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావు
  • ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీదే అధికారం
  • బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు

బీజేపీపై టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డితో కలిసి బీజేపీ లాలూచీ రాజకీయాలు చేస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని, కర్ణాటకలోనూ బీజేపీకి బుద్ధి చెప్పడానికి అక్కడి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీదే అధికారమని, బీజేపీ నేతలు వైసీపీని చూసుకొని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కేంద్ర సర్కారు నిధులు ఇస్తోంటే ఏపీ వద్దందని ఆ పార్టీ నేత జీవీఎల్‌ నరసింహారావు అసత్య ప్రచారం చేస్తున్నారని బోండా ఉమ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here