ఆధార్.. భేష్: బిల్ గేట్స్ ప్రశంసలు

0
255
  • ఆధార్ సురక్షితమైనది
  • ఆధార్ ను మోదీ కొనసాగిస్తుండటం మంచి పరిణామం
  • ఈ టెక్నాలజీ ఇతర దేశాలకు కూడా అవసరం

ఆధార్ కార్డు చాలా సురక్షితమైనదని, ప్రైవసీ సమస్యలు దీనికి లేవని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ చెప్పారు. ఆధార్ ను ఇతర దేశాలకు కూడా తీసుకెళ్లేందుకు గాను ప్రపంచ బ్యాంకుకు బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ నిధులు అందిస్తోంది. ఆధార్ కు చీఫ్ ఆర్కిటెక్ట్ అయిన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నిలేకని ప్రపంచ బ్యాంకుకు తన సహకారాన్ని అందిస్తున్నారని బిల్ గేట్స్ తెలిపారు. ఆధార్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పారు. ఆధార్ లాంటి టెక్నాలజీని ఇతర దేశాలకు కూడా తీసుకెళ్లేందుకు ప్రపంచ బ్యాంకుకు తాము నిధులను ఇస్తున్నామని తెలిపారు. ఆధార్ అనేది కేవలం బయో ఐడీ వెరికేషన్ స్కీమ్ మాత్రమేనని… దీని వల్ల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధాని కాకముందే ఆధార్ అందుబాటులోకి వచ్చిందని… ఆధార్ ను మోదీ కొనసాగిస్తుండటం మంచి పరిణామమని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here