తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్‌ సృష్టించింది బాహుబలి 2. దాదాపు అన్ని భాషల్లో టాప్‌ గ్రాసర్‌గా చరిత్ర సృష్టించింది ఈ సినిమా. ఓవర్‌సీస్‌ లో కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన బాహుబలి 2 ఈ శుక్రవారం చైనాలో రిలీజ్ అవుతోంది. చైనాలోని ఐమాక్స్‌ స్క్రీన్స్‌ మీద రిలీజ్‌ అవుతున్న తొలి భారతీయ సినిమాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్న బాహుబలి 2కు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్‌ లో వినిపిస్తోంది.

ఈ సినిమా చైనాలో 7000లకు పైగా స్క్రీన్స్‌ లో రిలీజ్‌ కానుంది. దంగల్‌ సినిమా 7000 వేల స్క్రీన్స్‌ మీదే రిలీజ్‌ కాగా బాహుబలి అంతకు మించి భారీ స్థాయిలో విడుదలవుతోంది. దంగల్‌ రికార్డ్‌ను చెరిపేసిన బాహుబలి 2.. 8000 స్క్రీన్‌లపై రిలీజ్‌ అయిన భజరంగీ బాయ్‌జాన్‌ రికార్డ్‌ను మాత్రం దాటలేకపోయింది. బాహుబలి తొలి భాగం చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరి బాహుబలి 2 అయినా సత్తా చాటుతుందేమో చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments