• సెప్టెంబర్ 15 డెడ్ లైన్
  • దరఖాస్తులను అందుబాటులో ఉంచిన హోమ్ మంత్రిత్వ శాఖ
  • దరఖాస్తులు, సిఫార్సులు పంపాలని విజ్ఞప్తి

వివిధ రంగాల్లో సేవలందించే వారికి ప్రతి సంవత్సరమూ అందించే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాల నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డు తమకు దక్కాలని భావించేవారు, ఫలానావారు అర్హులని భావించేవారి కోసం దరఖాస్తులు సిద్ధం చేశామని తెలిపింది. ఆన్ లైన్లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తామని, ‘www.padmaawards.gov.in‘ వెబ్ సైట్ ద్వారా సెప్టెంబర్ 15లోగా దరఖాస్తులు, సిఫార్సులు పంపాలని హోమ్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కళలు, సాహిత్యం, వైద్యం, క్రీడలు, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, పౌర సేవలు, వ్యాపార, వాణిజ్య రంగాల్లో సేవలు చేసిన వారికి ఈ అవార్డులను అందిస్తారన్న సంగతి తెలిసిందే. నియమ నిబంధనల ప్రకారం వెబ్ సైట్ లో సూచించిన విధంగా దరఖాస్తులు చేయాల్సి వుంటుందని, ఎంచుకున్న రంగంలో దరఖాస్తుదారు చేసిన కృషిని 800 పదాలకు మించకుండా రాసి పంపాలని సూచించింది.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments