నాకేం కావాలనేది వాళ్లకి తెలుసు: కొరటాల శివ

0
352
  • దేవిశ్రీకి .. రామజోగయ్యకి కథ చెబుతాను
  • పాటలు వచ్చే సందర్భాలు వివరిస్తాను
  • మిగతా సంగతి వాళ్లు చూసుకుంటారు

కొరటాల శివ సినిమాలను పరిశీలిస్తే కథా కథనాలకు ఆయన ఎంతటి ప్రాధాన్యతనిస్తాడో .. సంగీత సాహిత్యాలకు అంతటి ప్రాముఖ్యతనిస్తాడనే విషయం అర్థమైపోతుంది. ఇటీవల ఆయన నుంచి వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమా కూడా ఇదే విషయాన్ని మరోసారి నిరూపించింది. కొరటాల ప్రతి సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ .. గీత రచయితగా రామజోగయ్య శాస్త్రి పనిచేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని గురించి కొరటాల ప్రస్తావిస్తూ .. ” దేవిశ్రీ ప్రసాద్ కి .. రామజోగయ్య శాస్త్రికి నేను కథ చెబుతాను  పాటలు వచ్చే సందర్భాలను వివరిస్తాను. అంతే ఆ తరువాత వాళ్ల నుంచి నాకు మంచి అవుట్ పుట్ వస్తుంది. నాకు ఏం కావాలనేది వాళ్లకి బాగా తెలుసు .. అందువల్లనే వాళ్లతో కలిసి పనిచేయడం నాకు సౌకర్యవంతంగా ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here