ఉత్తరాంధ్ర అభివృద్ధి పాటు పడతానని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. బుధవారం విశాఖపట్టణంలోసంఘీభావ యాత్ర ప్రారంభానికి ముందు ఆయన మాట్లాడారు.వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మద్దుతుగా సంఘీభావ యాత్రతో ప్రజల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేటి వరకూ అమలుకు నోచుకోలేదని అన్నారు. ‘ఏపీ హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో గత నాలుగేళ్లుగా వైఎస్సార్ సీపీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. అధికారంలో ఉన్న టీడీపీ-బీజేపీ కూటమి రాష్ట్రానికి అన్యాయం చేశాయి. ఎన్నికల ప్రచారంలో తిరుపతి వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. విశాఖకు రైల్వే జోన్‌ను కూడా ప్రకటిస్తామన్నారు. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కుల అనే నినాదంతో వైఎస్ జగన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం చేస్తున్నారు.