సురేఖను చూసి పడిపోయా…

629

ధీర్‌ బాబు, అదితీరావు హైదరి జంటగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవి మూవీస్‌ పతాకం పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవితో సుధీర్‌బాబు కాసేపు సంభాషించారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘సమ్మోహనం’ అనగానే సరెండర్‌, మెస్మరైజింగ్‌, ఫ్లాట్‌ అయిపోతున్నామనే ఫీలింగ్‌ కలిగింది. సురేఖను చూడగానే నేను సమ్మోహితుడనయ్యాను. తెలుగు టైటిళ్లను మరిచిపోతున్న తరుణంలో ‘రంగస్థలం’, ‘భరత్‌ అనే నేను’, ఇప్పుడు ‘సమ్మోహనం’ టైటిల్స్‌ వినడానికి చాలా బావున్నాయి. మోహనకృష్ణ తీసిన ‘అమీతుమీ’ చిత్రం మా ఇంటిల్లిపాదీ నచ్చింది. ఈ సినిమా టీజర్‌ చూడగానే ఎట్రాక్ట్‌ అయ్యాను. ముఖ్యంగా అమ్మాయితో 40 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఏంటని చెప్పే సన్నివేశం చూస్తే చక్కన ప్రేమకథలా అనిపించింది’’ అని అన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుదూ ‘‘ఓ అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి, ఓ ఫిల్మ్‌ స్టార్‌కి మధ్య జరిగే లవ్‌స్టోరీ ఇది. ‘గోల్కొండ హై స్కూల్‌’ సమయంలో ఒక రియల్‌ ఇన్సిడెంట్‌ నుంచి ఇన్‌స్పైర్‌ అయ్యి దర్శకుడు ఈ చిత్రం తీశారు’’ అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here