బీ జె పీ ని అధికారంలోకి రానివ్వను…

606

దక్షిణ భారత దేశ ప్రముఖ సినీ నటులు ప్రకాష్ రాజ్ ఈ మధ్యన బీ జె పీ వైఖరిని ఎందగడుతున్న విషయం తెలిసినదే . ఆయన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ఒక సమాజం నుంచి వచ్చిన కళాకారుడికి సమాజం మీద దారుణమైన దాడి జరుగుతున్నపుడు అండగా నిలబడాలసిన బాధ్యత ఉందన్నారు. మోదీ సర్కారు కాని,బీ జె పీ కాని గత మూడున్నర సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉన్నప్పుడు ప్రశ్నిస్తే ఆ మనిషిని చంపడమో,సైలెంట్ చేయడమో చేస్తున్నారని ఇలాంటి వాళ్ళని ఆపాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ తన కంటే గొప్ప నటుడని ఏమి చేయకుండా చేసాము అని చెప్పడం నటన కాదా అని ప్రశ్నించారు. తాను జాతీయ రాజకీయం గురుంచి మాట్లాడుతునాని ముందుగా కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని ఆపడం ముఖ్యం అన్నారు. కర్ణాటక లో ఆపడం ద్వారా మొత్తం భారత దేశం లో ప్రభావం ఉంటుందని,వారి పతనం మొదలవ్వాలన్నారు.

బీ జె పీ అధికారం లో ఉంది కాబట్టి ప్రశ్నిస్తున్నానని, బీ జె పీ కి ఒక సిద్ధాంతం లేదని , ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారని,వారు కేవలం ఒక దిష్టిబొమ్మలాంటి వాళ్ళన్నారు. నోట్ల రద్దు గురుంచి మాట్లాడుతూ ప్రధాని కొత్త నోట్ల కొరకు 50 రోజులు వేచి చూడమన్నారు,కాని ఇప్పటికి కూడా ఏ టీ ఎం ల ముందు ఇంకా నిలబడాల్సిన పరిస్థితి,అంటే సంవత్సరం అయినా కూడా ఇంకా కొత్త నోట్లు ముద్రించలేదా అని ప్రశ్నించారు,అలాగే ఇప్పటిదాకా ఎంత నల్ల డబ్బు రిజర్వు బ్యాంకు చేరిందనేది సమాచారం లేదన్నారు .15 లక్షల డబ్బు ఇస్తామని,కనీసం పదివేల రూపాయల కూడా ఇవ్వలేదన్నారు. సంవత్సరం అయినా కూడా ఇంకా నల్ల డబ్బు పై రైడ్లు జరుపుతున్నారని,రాజకీయ పక్షాలయ్యుండి నల్ల డబ్బు వద్దన్నవాళ్ళు వాళ్ళే నల్ల డబ్బు ఓట్ల కోసం ఇస్తుంటే అర్థం ఎంటని ప్రశ్నించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నోట్ల రద్దు ద్వారా చిన్న చిన్న వ్యాపారులు చితికిపోయారని వారికి ఉద్యోగాలు ఇస్తామన్నారా,తీసేస్తామన్నారా అని విమర్శించారు.

జీ ఎస్ టీ కూడా సరిగ్గా అమలు కాలేదని చేనేత కార్మికుల వంటి వారి మీద అమలు చేయడం సరికాదన్నారు. తనను కాంగ్రెస్ ఆహ్వానిస్తే కచ్చితంగా వెళ్ళలని వారు తప్పు చేసినా కూడా ప్రశ్నిస్తానన్నారు. తాను కే సీ ఆర్ ను కలవడం వెనుక ఎటువంట రాజకేయం కోణం లేదని ఆయన దేశం కోసం ఆలోచిస్తున్నారని ఆయనతో కలిసి పనిచేయడంలో ఏం తప్పుందన్నారు . ఫెడరల్ ఫ్రంట్ గురుంచి అడగగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఇంకా మొదటి దశలోనే ఉందని కే సీ ఆర్ పది మందితో చర్చిస్తున్నారని దాని గురుంచి ఎలా చెప్పాలన్నారు. కర్ణాటక ఓటర్లు ఆలోచిస్తున్నారని వారు సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు. తన సహా నటుడు సాయి కుమార్ బీ జె పీ కి ఇస్తున్న మద్దతు గురుంచి అడగగా ఆయనకి వేరే సిద్ధాంతం ఉందని వద్దనడానికి తానెవరన్నారు, ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ప్రజలు సమాజం కోసం,భవిష్యత్తు కోసం ఒక నిమిషం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోమని,మళ్ళీ 5 ఏళ్ళ కు కాని అవకాశం రాదన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here