సామాన్యంగా విమానం ఎక్కితే ఫోన్లు మూగబోతాయ్. దూర ప్రయాణాలప్పుడు చాల బోర్ గా ఫీలవుతుంటాం. ఇక నుంచి ఆ బాధ లేదు,ఎందుకంటే  విమానంలో ఫోన్ మరియు అంతర్జాలం వాడుకునే అవకాసం మరో  మూడు,నాలుగు నెలల్లో ఇది అమలులోకి రానుంది. టెలికం కమిషన్ ఇందుకు సంబంధించి ఇన్ ఫ్లయిట్ కనెక్టివిటీ సేవలను భారత గగనతలంలో అందించేందుకు అనుమతించింది.

శాటిలైట్ ఆధారితంగా ఈ సేవలు అందనున్నాయి. అలాగే, ఓడల్లో ప్రయాణించేవారికీ ఈ సేవలు అందించేందుకు గ్రిన్ సిగ్నల్ ఇచ్చింది. టెలికం రంగంలో వినియోగదారుల ఫిర్యాదులను మరింత మెరుగ్గా పరిష్కరించేందుకు ట్రాయ్ ఆధ్వర్యంలో అంబుడ్స్ మెన్ వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలియజేసింది. యాప్ ఆధారిత ఇంటర్నెట్ కాల్స్ అందించే ప్రతిపాదనకు సైతం అనుమతి తెలిపింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments