అలనాటి మహానటి జీవిత కథ ఆధారంగా చిత్రీకరించన చిత్రం “మహానటి “. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నైత్న్చాగా, మిగిలిన ముఖ్య పాత్రలలో దుల్కర్ సల్మాన్,సామంత అక్కినేని,విజయ్ దేవరకొండ నటించారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్సకత్వం వహించగా,స్వప్న సినిమా బ్యానర్ పై అశ్విని దుత్త్ నిర్మించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరిగినది. ఈ సందర్భంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్ టీ ఆర్ మాట్లాడుతూ ఈ ఆడియో ఫంక్షన్ లో ఈ స్టేజి మీద నుంచొని ఆవిడ గొప్పతనం గురుంచి మాట్లాడే అర్హత ఎన్ని జన్మలెత్తినా రాదేమోనని,సావిత్రి గారు ఎలా బ్రతికారు అని కళ్ళకు కట్టినటు చూపారన్నారు. కొంతమంది జీవితాలు మనము ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం ఉంది,అటువంటి వాళ్ళల్లో సావిత్రి గారు ఒకరన్నారు. ఈ చిత్రాన్ని అశ్విన్ ఒక దర్శకుడిగా కాక ఒక అభిమానిగా తీసాడన్నారు. సామాన్యం ఇటువంటి చిత్రాలు తీయడం ఒక కల అని అటువంటి కళను కేవలం అశ్వినీదత్తు గారి వల్లే సాధ్యం అవుతుందని. ఈ చిత్రంలో తనను ఎన్ టీ ఆర్ పాత్ర కోసం సంప్రదించగా,తాను ఆ మహానుభావుడి పాత్రను పోషించలేనని చెప్పానని అన్నారు. ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు నటిస్తే సరిపోదని, జీవించాలని అన్నారు.ఒక్కోసారి మనం ఒక గొప్ప విషయాన్ని చేయబోతునప్పుడు వేత్తుకోవలసిన అవసరం లేదని ,అదే వచ్చేస్తుంటుంది. అదేవిధంగా నేచర్ కీర్తిసురేష్ ని,సమంత ని,దుల్కర్ సల్మాన్ ని,విజయ్ దేవరకోండ ని తీసుకొచ్చిందన్నారు.ఈ మధ్య ఆడవాళ్ళ మీద అకృత్యాలు పెరుగుతున్నాయని. ఈ చిత్రాన్ని చూసిన తరువాత ఆడవాళ్ళ మీద గౌరవం పెరుగుతందన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments