మాజీ సేబేఐ జె.డి లక్ష్మీనారాయణ ఇటీవలే పదవీ విరమణ చేసి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టారు. పదవీ విరమణ చేసిన వెంటనే రైతులతో సమావేశమయ్యారు. కాగా ఆయన  రేపటి నుంచి నాలుగు రోజుల పాటు  శ్రీకాకుళంలోని పలుగు గ్రామాలను సందర్శించనున్నారు. రేపు ఉదయం పాలకొండ రైతులు,విధ్యార్ధులతో సమావేశమావ్వనున్నారు..4 న దుసి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ఐరన్ ఫ్యాక్టరీ బాధితులతో చర్చించనున్నారు,మధ్యాహ్నం ఆముదాలవలస లో త్వరలో మూతపదబోతున్న షుగర్ ఫ్యాక్టరీ ని సందర్శించనున్నారు. 5 వ తీదీన ఇచ్చాపురం నియోజికవర్గంలోని గ్రామస్థులతో చర్చించనున్నారు. 6 వ తేదీన పొందూరు గ్రామంలో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకోనున్నారు…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments