ఎన్డీఏ,యూపీఏ లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేసే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రయత్నిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం తానే స్వయంగా కలకత్తా వెళ్లి మమతాబెనర్జీ తో చర్చలు జరిపారు.అలాగే మొన్న చెన్నై వెళ్లి అక్కడ కనిమోలి,కరుణానిధి వంటి వారితో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారు.70 ఏళ్లగా దేశం అభివృద్ధి బాటలో మిగతా దేశాలతో పోటీ పడలేకపోతుందని, దేశ అభివృద్ధి కొరకు కచ్చితంగా కొత్త కూటమి అవసరం ఉందని అందుకనే ఫ్రంట్ కు ప్రయత్నిస్తున్నామని కేసీఆర్ గతంలో తెలిపారు…
అయితే తాజాగా యూపీ మాజీ ముఖ్యమంత్రి,సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానం ద్వారా బేగుంపేట విమానాశ్రయానికి చేరుకోగా తెలంగాణా రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారు. అక్కడి నుండి ప్రగతి భవనంకు భయలుదేరారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబందించిన విషయాలను అఖిలేష్ యాదవ్, కేసీఆర్ చర్చించనున్నారు..