దేశంలో గుణాత్మకమార్పు రావాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కేసీఆర్‌ను యూపీ మాజీ సీఎం అఖిలేశ్ కలిశారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్‌పై ఇరువురు చర్చించారు. అనంతరం ఇద్దరు మీడియాతో మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం మా ప్రయత్నం కొనసాగుతోందని కేసీఆర్ వెల్లడించారు. కొంతమంది తెలిసీ తెలియక చిన్న ప్రయత్నమనుకుంటారని చెప్పుకొచ్చారు. ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించడానికే అఖిలేష్ హైదరాబాద్ వచ్చారన్నారు. అఖిలేష్‌తో చాలా రోజులుగా టచ్‌లో ఉన్నానన్నారు. దేశంలో రాజకీయ వ్యవస్థ, సుపరిపాలనపై చర్చించామన్నారు. ఏడు దశాబ్దాల స్వాతంత్రం తర్వాత కూడా ప్రజల ఆశలు నెరవేరలేదని వాపోయారు. అభివృద్ధిలో చైనా దూసుకెళ్తోందని కేసీఆర్ కితాబిచ్చారు. అఖిలేష్‌తో విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయన్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి.. మరి కొంతమంది నేతలతో చర్చిస్తానన్నారు. ఫ్రంట్ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
Subscribe
Login
0 Comments