వినియోగదారులకు ఊరటనిచ్చే విషయాన్ని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. సిమ్ కార్డులు తీసుకోవాలంటే ఆధార్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ వీటిలో ఏదో ఒక డాక్యుమెంట్ ను ఇవ్వడం ద్వారా సిమ్ కార్డును పొందొచ్చని ఆమె సూచించారు. కస్టమర్లను ఇబ్బంది పెట్టుకుండా వెంటనే దీన్నిఅమలు చేయాలని టెలికం ఆపరేటర్లను కోరినట్టు చెప్పారు. ఆధార్ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తాము తుది నిర్ణయం వెలువరించేంత వరకు సిమ్ కార్డులు పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కొన్ని కంపెనీలు సిమ్ కార్డుకు ఆధార్ ను అడుగుతుండడం, ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చినప్పుడు వారు ఆధార్ ఇవ్వలేని పరిస్థితుల్లో సిమ్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టెలికం శాఖా తాజా ఆదేశాలు కస్టమర్లకు ఉపశమనం కలిగించేవే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments