సీ ఫోర్ సర్వేలో బీజేపీకి షాక్.

0
253
  • కాంగ్రెస్ 118 నుంచి 128 సీట్లు
  • 63 నుంచి 73 సీట్లకు బీజేపీ పరిమితం
  • సీ ఫోర్ తాజా సర్వే

కర్ణాటకలో ఏ పార్టీకి అధికారం రాదని, హంగ్ తప్పదని పలు సంస్థలు తమతమ పోల్ సర్వేలను ప్రకటించిన వేళ, గతంలో పలు ఎన్నికల ఫలితాలను అత్యధిక కచ్చితత్వంతో వెల్లడించిన సీ ఫోర్ సర్వే మాత్రం కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వస్తాయని చెబుతూ బీజేపీకి షాకిచ్చింది. రాష్ట్రంలోని 165 నియోజకవర్గాల్లోని 24,679 మంది ఓటర్లను సర్వే చేస్తూ, ఫలితాలను వెల్లడించింది సీ ఫోర్. 2017లో 340 పట్టణాలు, 550 గ్రామాలకు చెందిన అన్ని కులాల వారినీ తమ తొలి సర్వేలో భాగం చేస్తూ, కాంగ్రెస్ కు 120 నుంచి 132 సీట్లు, బీజేపీకి 60 నుంచి 72 సీట్లు, జేడీఎస్ కు 20 నుంచి 30 సీట్లు, ఇతరులకు 1 నుంచి 7 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

ఇక మార్చి 2018లో నిర్వహించిన తాజా సర్వే తరువాత కాంగ్రెస్ కు 126, బీజేపీకి 70, జేడీఎస్ కు 27 నుంచి 40, ఇతరులకు 1 స్థానం వస్తాయని పేర్కొంది. ఆపై ఏప్రిల్ లో మరో సర్వే చేసి కాంగ్రెస్ కు 118 నుంచి 128, బీజేపీకి 63 నుంచి 73, జేడీఎస్ కు 29 నుంచి 36, ఇతరులకు 2 నుంచి 7 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇదిలావుండగా సీ ఫోర్ సంస్థ 2013 నుంచి ప్రకటించిన పలు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో 99 శాతం కరెక్టుకావడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here