సాయి పల్లవి,ఈ పేరు గత సంవత్సరకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మారుమోగుతోంది.ఫిదా సినిమాలో నటించి తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరిని ఆకట్టుకుంది.తరువాత నానితో ఎంసీఏ లో జతకట్టి మంచి విజయాన్ని సాదించింది. సాయి పల్లవి,నాగాసౌర్య ముఖ్య పాత్రధారులుగా రూపొందిన తాజా చిత్రం కణం. ఈ చిత్రం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం కథ తనదేనంటూ ఓ వ్యక్తి చిత్ర యూనిట్‌పై ఆరోపణలు చేస్తున్నాడు. కోలీవుడ్‌లో పలు చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన చంద్రకుమార్‌ తన కథ కాపీ కొట్టారంటూ నడిగర్‌ సంఘంలో ఫిర్యాదు చేశాడు. హీరోయిన్‌ అబార్షన్‌.. ఆమె కుటుంబం మిస్టరీగా చనిపోవటం లాంటి నేపథ్యం అంతా తన కథలోదేనని.. దియా(కణం) రచయిత రాజకుమారన్‌. తన కాపీ కొట్టారంటూ చంద్ర ఆరోపిస్తున్నాడు. ఇప్పటికే డివైడ్‌ టాక్‌తో థియేటర్లో నడుస్తున్న ఈ చిత్రానికి.. ఈ వివాదం మరిన్ని కష్టాల్లో నెట్టేసింది. ఈ వివాదంపై స్పందించేందుకు నిర్మాతలు నిరాకరిస్తున్నారు. నాగశౌర్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ థ్రిల్లర్‌ మూవీకి ఏఎల్‌ విజయ్‌ దర్శకుడు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments