• మార్చి 30న విడుదలైన ‘రంగస్థలం’
  • నెల రోజుల్లోనే రూ. 200 కోట్ల కలెక్షన్లు
  • ‘బాహుబలి’ తరువాత హయ్యస్ట్ గ్రాసర్

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ చిత్రం రూ. 200 కోట్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. మార్చి 30న విడుదలైన ఈ చిత్రం నెల రోజుల వ్యవధిలోనే ఇంత భారీ కలెక్షన్లు రాబట్టి, ‘బాహుబలి’ చిత్రాల తరువాత ఈ ఘనత సాధించిన రెండో సినిమాగా నిలిచింది. మరోవైపు రామ్ చరణ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు కూడా ఇవే కావడం గమనార్హం. ఈ చిత్రం విడుదలైన రెండు వారాల తరువాత మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’ ఇప్పటికే రూ. 180 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, ‘రంగస్థలం’తో పోటీపడుతూ దూసుకెళుతోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments