జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సంచలనమైన విషయాలు వెల్లడి చేసారు. రానున్న ఎన్నికలలో జనసేన ఆంధ్రప్రదేశ్ లోని 175 స్థానాలలో పోటీ చేస్తుందని తెలిపారు. బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయివరకు పక్కా ప్రణాళిక బద్ధంగా అడుగులు వేద్దామని అన్నారు. పార్టీకి ఎన్నికలలో పాల్గొన్న అనుభవం లేకపోయినా ప్రతీ కార్యకర్తకి రెండు ఎన్నికలలో పాల్గొన్న అనుభవం ఉందని తెలిపారు. ఈ నెల 11 న తన రాష్ట్ర పర్యటన గురుంచి వెల్లడిస్తానని తెలిపారు. జనసేన పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా దేవ్ ను నియమించామని,ఆయనకీ నాటి సీ.పి.ఎఫ్ సంస్థ కార్యకర్తలు 1200 మంది సహకరిస్తారని,గత ఎనిమిది నెలలుగా దేవ్ జనసేనకు పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో పోటీ గురుంచి ఆగష్టు రెండో వారంలో వెల్లడిస్తామని అన్నారు.
Subscribe
Login
0 Comments