ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత,వై ఎస్ ఆర్ సీ పీ అధ్యక్షులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజసంకల్పయత్ర నేటితో 150 వ రోజుకు చేరుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు కూడలిలో నిర్వహించిన భారీ బహిరంగసభలో పాల్గొన్న జగన్ తెలుగుదేశం పార్టీ వైఖరిపై మండిపడ్డారు. ఏపీకీ సీఎం కాగానే బెల్ట్ షాపులు రద్దు ఫైలు పై మొదటి సంతకం పెట్టారని,కానీ వారి మంత్రే దగ్గరుండి వేలం వేయిస్తున్నారని,మొత్తం రాష్ట్రమంతా ఊరూరా బెల్టు షాపులు పెంచేసారని అన్నారు. ప్రజలను తాగించి ఆదాయం చేసుకుంటూ వ్యవస్థను కాపాడాల్సిన వారే నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. హోదా విషయం నాలుగేళ్ళుగా చంద్రబాబు మభ్యపెడుతున్నారని ఇక ఈ మోసాలు సాగవని అన్నారు. ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ. పొత్తులపై వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని,ఎవరు హోదా ఇష్టామంటే వారితో మద్దతు ఉంటుందని చెప్తామనారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాదిస్తామని తెలిపారు.

నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా రాక చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కరువయ్యాయని,గతంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను మళ్ళీ కబ్జా చేస్తున్నారని,ఆఖరికి స్మశానాలను,మరుగుదొడ్లను కూడా టీడీపీ నేతలు వదలడం లేదన్నారు.

శివలీలమ్మ.. దివంగత నేత ఎన్టీఆర్ మొదటి భార్య బసవ తారకం బంధువు. ఆమె తనను కలిసి వాళ్ల బాధలు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారన్నారు.. అన్నా.. మాకు కొన్ని భూములున్నాయి. ఆ భూములు అమ్మే, కొనే విషయంలో వివాదాలొచ్చాయి. టీడీపీ నేతలు చెప్పిన వాటికి మేం ఒప్పుకోలేదని నాలుగు రోజులపాటు స్టేషన్లో పెట్టారు. పొద్దునపూట స్టేషన్‌కు.. రాత్రిపూట ఓ ఇంటికి, లేక లాడ్జీలకు తీసుకెళ్తారు. ఇలా నాలుగు రోజులు పోలీస్ స్టేషన్లు, లాడ్జీలు.. ఇలా మారుస్తూ ఆడవాళ్లని కూడా చూడకుండా వేధింపులకు గురిచేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారని జగన్ తెలిపారు.

కచ్చితంగా బందర్ పోర్ట్ కడతాం. అవసరమైన 4,800 ఎకరాలు మాత్రమే తీసుకుంటామని, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం తీసుకొస్తామని అన్నారు.. అధికారంలోకి రాగానే వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తాం. లక్షా 42 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని,ఏటా ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. గ్రామ సచివాలయాల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చి.. పెన్షన్, రేషన్ కార్డులు, ఆరోగ్య, ఫీజు రీయింబర్స్ మెంట్‌లను 72 గంటల్లో మంజూరు చేస్తాం. పథకాల అమలులో కులాలు, మతాలు, పార్టీలు అంటూ వ్యత్యాసం లేకుండా పేదలందరికీ న్యాయం చేసే పాలన అందిస్తామనారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments