న్యూ లుక్‌లో నందమూరి హీరో

0
214

ఈ జనరేషన్ హీరోలు సినిమా కథ కథానాల మీదే కాదు.. సినిమాలో క్యారెక్టర్‌కు తగ్గ లుక్‌ కోసం కూడా చాలా శ్రమిస్తున్నారు. నందమూరి యంగ్ హీరో కల్యాణ్ రామ్‌ ప్రతీ సినిమాలో కొత్తగా కనిపించేందుకు కష్టపడుతున్నాడు. ఇటీవల ఎమ్మెల్యే సినిమా కోసం ఫార్మల్‌ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించిన కల్యాణ్ రామ్‌ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘నా నువ్వే’ సినిమాలో క్లాస్‌ లుక్‌లో ఆకట్టుకోనున్నాడు.

నా నువ్వే తరువాత మరోసారి ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో సినిమా చేయనున్నాడు కల్యాణ్‌ రామ్‌. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం రఫ్‌ లుక్‌లోకి మారిపోయాడు కల్యాణ్‌ రామ్‌. స్టైలిష్‌ హెయిర్‌ స్టైల్‌, లైట్‌గా గెడ్డంతో రఫ్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు ఈ నందమూరి హీరో. తాజాగా ఈ లుక్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here