చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్ సెట్స్ తయారీ సంస్థ కూల్ ప్యాడ్ సెల్ఫీ ప్రియులను దృష్టిలో ఉంచుకుని దేశీయ మార్కెట్లోకి కూల్ ప్యాడ్ నోట్ 6 పేరుతో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. దీని ధర రూ.8999. తెలంగాణ, ఏపీ సహా ఎనిమిది రాష్ట్రాల్లోని 300 స్టోర్లలో ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.ఇందులో చాలా ఫీచర్స్ పొందుపరిచారు.డ్యుయల్ నానో సిమ్, ఆండ్రాయిడ్ నౌగత్ 7.1 ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్, 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 435 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, ముందు భాగంలో రెండు కెమెరాలు (8 5 మెగా పిక్సల్), వెనుక 13 మెగాపిక్సల్ కెమెరా, అపెర్చర్ ఎఫ్ 2.2, 4జీ వోల్టే, 4070 ఎంఏహెచ్ బ్యాటరీ పలు ముఖ్యమైన సెన్సార్లు ఉన్నాయి. 32 జీబీ స్టోరేజీ, 64 స్టోరేజీతొో రెండు వేరియంట్లను కంపెనీ అందిస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments