చెన్నై @ 100…

0
348

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఆటగాడిగా చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని రికార్డు సృష్టించారు. అంతేకాకుండా అత్యధిక టీ-20లు గెలిచిన జట్ల జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండో స్థానంలో నిలిచింది. ఐపీఎల్‌ 11వ సీజన్‌లో భాగంగా సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలుపుతో ధోని ఈ ఘనతను అందుకున్నారు.

కెప్టెన్‌గా ధోని నేతృత్వంలో చెన్నైకి ఇది 100వ విజయం. చెన్నై సూపర్‌కింగ్స్‌ మొత్తం 166 మ్యాచ్‌లు ఆడగా 100 విజయాలు నమోదు చేసుకుంది. ఐపీఎల్‌లో చెన్నై అత్యధిక విజయాలను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)పైనే సాధించింది. ఇప్పటివరకూ మొత్తం 12 సార్లు ఆర్‌సీబీపై చెన్నై గెలిచింది. కాగా, అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్ల జాబితాలో ముంబై ఇండియన్స్‌ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకూ 186 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్‌ 104 విజయాలను సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here