తిరుపతిలో ఎస్వీ విశ్వవిద్యాలయం ప్రాంగణములో టీడీపీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట సభ జరిగినది.ఈ కార్యక్రమానికి అనేకమంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,శాసనసభ్యులు,పార్లమెంట్ సభ్యులు,అధిక సంఖ్యలో శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు,హిందూపూర్ నియోగికవర్గం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ ఈ విధంగా మాట్లాడారు. కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని ఆ రోజే చెప్పాను. కాంగ్రెస్, బీజేపీ కలసి రాష్ట్రాన్ని విభజించాయి. అశాస్త్రీయమైన విభజన జరిగింది. నాలుగేళ్ల కింద నరేంద్రమోదీ ఇదే వేదికపై మాట్లాడారు. రకరకాల వాగ్దానాలు చేసి పట్టించుకోలేదు. ఏపీకి హోదా ఇవ్వకుండా కేంద్రం ఎందుకు నాటకాలాడుతోంది? మనపై ఎందుకీ వివక్ష? కేంద్రానికి మనమంటే లెక్కలేకుండా పోయింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్.. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అప్పట్లో మనకు రావాల్సింది తెచ్చుకున్నారు. ఆనాటి అనివార్య పరిస్థితి మళ్లీ వచ్చింది. మనం పోరాడదాం. ఢిల్లీ నాయకుల మెడలు వంచుదాం. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఇదే ఆరంభం. ఇలాగే కొనసాగిద్దాం.
Subscribe
Login
0 Comments