వైసీపీ అధినేత జగన్ నయవంచకుడని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ప్రజలను వంచించి లక్షల కోట్లను సంపాదించడం వంచన కదా? రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ తో లాలూచీ పడి బెయిల్ తెచ్చుకోవడం వంచన కదా? బీజేపీతో ఇప్పుడు అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం లాలూచీ కాదా? రాష్ట్ర అభివృద్ధి అనుక్షణం అడ్డుపడటం వంచన కదా? అని యనమల ప్రశ్నించారు. విశాఖలో వైసీపీ చేస్తున్నది వంచన వ్యతిరేక దీక్ష కాదని, నయవంచన దీక్ష అని యనమల అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ ఇప్పటికైనా బీజేపీతో లాలూచీ రాజకీయాలు మానేసి రాష్ట్రాభివృద్ధికి సాయపడాలని అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments