చైనీస్‌ హ్యాండ్‌సెట్‌ తయారీదారి వివో తన ‘వై’ సిరీస్‌ను విస్తరించుకుంటూ వెళ్తోంది. ఈ విస్తరణలో భాగంగా ఆల్ట్రా-హెడ్‌ టెక్నాలజీతో ‘వై53ఐ’ స్మార్ట్‌ఫోన్‌ను వివో లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 7,990 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్‌కు ఆల్ట్రా-హెడ్‌ టెక్నాలజీ కూడిన 8 ఎంపీ రియర్‌ కెమెరా, 32ఎంపీ వరకు రెజుల్యూషన్‌ కలిగిన ఫోటోలను తీసే సామర్థ్యం ఉంటుంది. అదేవిధంగా ఈ ఫోన్‌కు 5ఎంపీ ఫ్రంట్‌ షూటర్‌ ఉంది. తక్కువ వెలుతురులో కూడా సెల్ఫీలను తీసుకునేందుకు వీలుగా ‘స్క్రీన్‌ ఫ్లాష్‌’ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు.

క్రౌన్‌ గోల్డ్‌, మేట్‌ బ్లాక్‌ రంగుల్లో అన్ని ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. వై53ఐ స్మార్ట్‌ఫోన్‌తో పోటీకరమైన ధర విధానంలో యూజర్లకు మంచి అనుభవాన్ని, అత్యుత్తమమై కెమెరాను అందించేందుకు తమ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తున్నామని వివో ఇండియా సీఎంఓ కెన్నీ జెంగీ తెలిపారు. ఈ ఫోన్‌కు 5 అంగుళాల డిస్‌ప్లే, 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌, 256జీబీ వరకు విస్తరణ మెమరీ, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 425 ప్రాసెసర్‌, 2500 ఎంఏహెచ్‌ బ్యాటరీలు ఉన్నాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments