విశాఖపట్నంలో వైసిపీ వంచన వ్యతిరేక దీక్ష చేపట్టింది . ఈ సందర్భంగా వైసిపీ ఎం.పి విజయసాయిరెడ్డి తెలుగుదేశంపై నిప్పులు చెరిగారు. టీడీపీ నిర్వహిస్తోంది అధర్మపోరాటసభ అని,ధర్మం అంటే ఏమిటో టీడీపీ శ్రేణులకు తెలియదనన్నారు. ప్రత్యేక హోదాను నీరుగార్చినది చంద్రబాబే అని ఆనాడే హోదా ఇస్తేనే ప్రమాణస్వీకారం చేస్తానని కండిషన్ పెట్టి ఉంటే అప్పుడే ప్రత్యేక హోదా వచ్చేదన్నారు . నేడు టీడీపీ హోదా విషయంలో దొంగనాటకాలు ఆడుతోందని,ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తున్నారని, దోచుకున్న 3 లక్షల కోట్లను హవాలా ద్వారా తరలించి సింగపూర్ లో ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. ఈ ద్వంద్వ ప్రమాణాలను ప్రజలు గమనిస్తున్నారని,ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. టీటీడీ పాలకమండలిలో బీజేపీ నాయకుడి భండువుని ఎందుకు నియమించారన్నారు . ఈ విధంగా తిరుమల కొండపై బీజీపీ తో దోస్తీ కొండ కింద కుస్తీ అన్నట్టు వ్యవహారం ఉందని విమర్శించారు…
Subscribe
Login
0 Comments