స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మే 4న సినిమా విడుదల చేస్తున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్గా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వక్కంతం వంశీ మాట్లాడుతూ బన్నీ పని రాక్షసుడని, ప్రతిషాట్ను కష్టపడి సొంతంగా చేసారని నాగబాబు చెప్పినట్లే ఆయన ఒక ఆకలితో ఉన్న పులిలా ఉంటారన్నారు….
Subscribe
Login
0 Comments