తాజాగా ఈ వ్యవహారం గురించి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాట్లాడాడు. తన ట్విటర్ ఖాతాలో పొందుపరిచిన వీడియోలో శ్రీదేవి.. `బాహుబలి` సినిమా ఎందుకు చేయలేదో వివరించాడు. `శ్రీదేవి `బాహుబలి` సినిమా చేయలేకపోవడానికి కారణం ఆమె భర్త బోనీ కపూరే. ఈ సినిమాలో నటించడం గురించి నేను అప్పట్లో శ్రీదేవితో మాట్లాడాను. అది చాలా గొప్ప సినిమా అని, ఆ క్యారెక్టర్‌ను వదులుకోవద్దని శ్రీదేవికి చెప్పాను. ఆ సినిమా చేయడానికి శ్రీదేవి కూడా ఆసక్తి చూపించింది. అయితే బోనీ కపూర్‌కు మాత్రం ఇష్టం లేదు. అందుకే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి `బాహుబలి` అవకాశం శ్రీదేవికి రాకుండా చేశారు. బోనీ కపూర్ నిర్ణయాల వల్ల శ్రీదేవి కెరీర్ పరంగా చాలా నష్టపోయారు. తండ్రి చనిపోయిన తర్వాత శ్రీదేవి ఒక్కరోజు కూడా సంతోషంగా లేదు` అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినిమా సత్తాను అంతర్జాతీయ వ్యాప్తంగా చాటిన సినిమా `బాహుబలి`. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా ఎంతో మందికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన `శివగామి` పాత్ర కోసం రమ్యకృష్ణ కంటే ముందుగా శ్రీదేవిని అనుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె భారీ పారితోషికం అడగడం, ఎక్కువ డిమాండ్లు చేయడం వల్ల ఆమెను పక్కనపెట్టామని దర్శకుడు రాజమౌళి స్వయంగా తెలియజేశారు.
Subscribe
Login
0 Comments