‘అన్నా…నాన్నగారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్లనే రెండు ఆపరేషన్లు చేయించుకొని ప్రాణాలతో ఉన్నా’ అని విజయవాడకు చెందిన రాజశేఖర్‌ ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్‌ను కలసి భావోద్వేగానికి లోనయ్యారు. పామర్రు వచ్చిన జగన్‌ను కలసిన రాజశేఖర్‌ తనకు జరిగిన ఆపరేషన్ల గురించి వివరించారు. కడుపు నొప్పితో బాధపడుతున్న తనకు ఆపరేషన్‌ ఖర్చులు భరించే స్థోమత లేని సమయంలో ఆరోగ్యశ్రీ ఆదుకుందన్నారు. రోడ్డు ప్రమాదంలో కుడిచేతికి గాయమైన పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ  ద్వారానే రాడ్డు వేశారని, తర్వాత రాడ్డు తీయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదని, డబ్బులు కట్టాలని డిమాండ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ ఉన్నప్పుడు ఎటువంటి నిబంధనలు లేకుండా ఆరోగ్యశ్రీ వర్తించేదని, ఇప్పుడు నిబంధనల పేరుతో పేదలను నరకయాతన పెడుతున్నారని జననేతకు వివరించారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని కోరారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments