రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ సినిమాలకు భిన్నంగా రామచరణ్,సుకుమార్ రూపొందించిన చిత్రం రంగస్థలం.విడుదల అయినప్పటినుండి అనేకమంది వివిధ మాధ్యమాల ద్వారా ప్రశంసించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్  ఐటీ, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి లోకేష్ చూశార‌ట‌. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. `మాకు `రంగ‌స్థ‌లం` వంటి గొప్ప సినిమాను అందించిన రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్‌ల‌కు హ్యాట్సాఫ్‌. సినిమా అయిపోయిన త‌ర్వాత కూడా ఆయా పాత్ర‌లు మ‌న‌ల్ని వెంటాడుతూనే ఉంటాయి. గ్రేట్ వ‌ర్క్ గాయ్స్‌` అంటూ చెర్రీ, సుకుమార్‌ల‌ను లోకేష్ అభినందించారు. లోకేష్ చేసిన ఈ ట్వీట్‌కు రామ్‌చర‌ణ్ ఫేస్‌బుక్ ద్వారా ధ‌న్య‌వాదాలు తెలిపాడు. `ధ‌న్య‌వాదాలు లోకేష్‌గారూ` అంటూ పోస్ట్ చేశాడు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments