• మేడిపల్లిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత
  • హైదరాబాద్‌లో 42 డిగ్రీలు
  • నిర్మానుష్యంగా హైదరాబాద్‌ రోడ్లు

ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.. ఈ రోజు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లిలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 42 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 1973 ఏప్రిల్ 30న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ తరువాతి నుంచి ఇప్పటివరకు ఏప్రిల్‌ లో నమోదైన ఉష్ణోగ్రతలో ఇదే అధికం. ఎండల వేడిమికి జనాలు ఇళ్లల్లో, తమ కార్యాలయాల్లోనే ఉండడంతో ఈ రోజు మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.

గాలిలో తేమ 24 శాతం వరకు తగ్గిపోయిందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లో పలు చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా పలు ప్రాంతాల్లో 40-41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్న వేళల్లో బయటికి రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments